కరోనా బాధితులకు భారత కెప్టెన్ సహాయం...

కరోనా బాధితులకు భారత కెప్టెన్ సహాయం...

చైనా నుండి వచ్చిన కరోనా ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వైరస్ ప్రభావం మనదేశం పైన కూడా బాగానే పడింది. అయితే కరోనా కారణంగా ఐపీఎల్ తో సహా అని అంతర్జాతీయ మ్యాచ్లకు దూరం అయ్యింది భారత క్రికెట్ జట్టు. అయితే ఈ వైరస్ ను ఎదురించడానికి భారత క్రికెటర్లు ఒక్కొక్కరు గా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయం చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కరోనా బాధితులకు సహాయం చేస్తునట్టు  ప్రకటించాడు. దీనికి సంబంధించి తన ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసాడు కోహ్లీ. అందులో..."అనుష్క మరియు నేను పీఎం క్రైసిస్ ఫండ్ మరియు మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు మా వంతుగా సహాయం చేస్తాము. కరోనా కారణంగా చాలా మంది ప్రజలు పడుతున్న బాధలను చూస్తూ మా హృదయాలు విరిగిపోతున్నాయి. అందుకే మా తోటి పౌరుల బాధను తగ్గించడానికి మా సహాయం ఒక విధంగా వారికి సహాయపడుతుందని మేము ఆశిస్తున్నాము" అని తెలిపాడు. అయితే కోహ్లీ ఏ విధంగా అలాగే ఎంత సహాయం చేస్తున్నాడు అనేది మాత్రం తెలుపలేదు. చూడాలి మరి కోహ్లీ ఏం సహాయం అధిస్తాడో అనేది.