అత్యుత్తమ ఔషధాన్ని కనిపెట్టిన విరాట్ కోహ్లీ

అత్యుత్తమ ఔషధాన్ని కనిపెట్టిన విరాట్ కోహ్లీ

గురువారం ఫీల్డ్ అంపైర్ ఘోర తప్పిదంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు ముంబై ఇండియన్స్ చేతిలో 6 పరుగుల తేడాతో ఓడిపోవడం ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీకి పట్టరాని ఆగ్రహం తెప్పించింది. కోపాన్ని ఏ మాత్రం దాచుకోకుండా వెళ్లగక్కాడు విరాట్. కానీ ఈ సంఘటన జరిగి ఒక్కరోజైనా కాకుండానే కోహ్లీ తన ఫ్రస్ట్రేషన్ కి కొత్త మందు కనిపెట్టాడు. అదే పగలబడి నవ్వడం. తన సోషల్ మీడియా పేజీల్లో ఆర్సీబీ  ఆటగాళ్లు యుజ్వేంద్ర చహల్, ఏబీ డివిలీర్స్ తో కలిసి డాన్స్ చేసిన వీడియోని కోహ్లీ షేర్ చేశాడు. ఆ వీడియోలో అవసరమైన దాని కంటే ఎక్కువగా చహల్ అత్యుత్సాహంతో డాన్స్ చేయడం చూసి కెప్టెన్ కోహ్లీ పగలబడి నవ్వుతున్నాడు.
Whatever happens laughter is the best medicine! pic.twitter.com/b38xyK9s1O

— Virat Kohli (@imVkohli) March 29, 2019
ఆ సెట్, షూటింగ్ చూస్తుంటే ఆర్సీబీ ప్రచారం కోసం తయారుచేస్తున్న కొత్త వీడియోగా అనిపిస్తోంది. ఆటగాళ్ల వెనక గ్రీన్ స్క్రీన్ ఏర్పాటు చేశారు. వీడియో చివర ప్లేయర్ల రియాక్షన్ చూస్తే ఆ వీడియోని మరోసారి షూట్ చేయక తప్పినట్టు లేదు.