విరాట్‌ కోహ్లీకి జరిమానా..

విరాట్‌ కోహ్లీకి జరిమానా..

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఐసీసీ భారీ జరిమానా విధించింది. ఐసీసీ నియమావళి ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్‌ ఫీజులో 25శాతం కోత విధించింది. నిన్న ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్‌ అలీం దార్‌తో దురుసుగా ప్రవర్తించినందుకు ఐసీసీ చర్యలు తీసుకుంది. రెహ్మత్‌ షా అవుటౌనట్టు భారత జట్టు అపీల్‌ చేసే సమయంలో అంపైర్‌ వద్దకు కోహ్లీ దూకుడుగా వెళ్లాడు. ఇలా చేసి.. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌లోని లెవెల్‌ 1తో పాటు ఆర్టికల్‌ 2.1ను కోహ్లీ ఉల్లంఘించినట్లు ఐసీసీ పేర్కొంది.