ఆర్‌సీబీ తొలి విక్టరీ.. కోహ్లీకి భారీ ఫైన్‌..

ఆర్‌సీబీ తొలి విక్టరీ.. కోహ్లీకి భారీ ఫైన్‌..

ఐపీఎల్‌-12లో బెంగళూరు పరాజయాల పరంపరకు తెరపడింది. వరుసగా ఆరు మ్యాచ్‌లు ఓడిన ఆర్‌సీబీ.. ఏడో మ్యాచ్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌పై 8 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది. ఇంత వరకు బాగానే ఉన్నా... ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి మాత్రం జరిమానా పడింది. బెంగళూరు-కింగ్స్‌ లెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్‌ కారణంగా కోహ్లీకి రూ.12లక్షలు జరిమానా విధించారు. దీంతో ఈ సీజన్‌లో తొలి విజయం  అందుకున్న కోహ్లీకి తొలి జరిమానా కూడా పడినట్లైంది. స్లో ఓవర్‌ రేట్‌ను ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళి కింద లెక్కగడతారు. దీంతో కోహ్లీకి మ్యాచ్‌ ఫీజులో కోత పడింది. ఇక ముంబై ఇండియన్స్‌- కింగ్స్‌లెవన్‌ పంజాబ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ముంబై జట్టు తరఫున స్లో ఓవర్ రేట్‌ కారణంగా ఆ జట్టు కెప్టెన్ రోహిత్‌ శర్మకు కూడా ఇదే తరహాలో జరిమానా పడిన విషయం తెలిసిందే.