గత 11 ఏళ్లలో కోహ్లీకి ఇదే మొదటి ఏడాది...

గత 11 ఏళ్లలో కోహ్లీకి ఇదే మొదటి ఏడాది...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్ లో నెంబర్ వన్ బ్యాట్సమెన్ అనే విషయం అందరికి తెలుసు. అయితే కోహ్లీ 2008 లో అంతర్జాతీయ కెరియర్ ప్రారంభించాడు. కానీ ఆ ఏడాది అతను సెంచరీ నమోదుచేయలేకపోయాడు. కానీ ఆ తర్వాత ఏడాది నుండి ఇప్పటి వరకు ప్రతి ఏడాది వన్డేల్లో ఒక్క సెంచరీ అయిన చేసిన కోహ్లీ మళ్ళీ ఈ ఏడాది ని ఒక్క సెంచరీ కూడా లేకుండానే ముగించాడు. అయితే ఈ ఏడాది కోహ్లీ చేసిన అత్యధిక స్కోర్ 89. ఈ సంవత్సరం కోహ్లీ రెండుసార్లు ఆస్ట్రేలియా పై 89 పరుగుల మార్కును చేరుకున్నాడు. మొదటి సారి ఈ ఏడాది జనవరిలో బెంగళూరులో... రెండోసారి గత ఆదివారం ఆసీస్ తో జరిగిన రెండో వన్డేలో. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది క్రికెట్ కు చాలా గ్యాప్ వచ్చింది. అందువల్ల కోహ్లీ 2020 లో కేవలం 9 వన్డే మ్యాచ్ లలో మాత్రమే ఆడాడు.