మొహాలీ టీ-20: భారత్ గ్రాండ్ విక్టరీ..

మొహాలీ టీ-20: భారత్ గ్రాండ్ విక్టరీ..

మొహాలీ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ-20 మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది.. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది... కెప్టెన్ డీకాక్ 52 పరుగులు, బావుమా 49 పరుగులు మినహా మిగతా బ్యాట్స్‌మెన్లు పెద్దగా రాణించలేకపోయారు. ఇక 150 పరుగుల విజయలక్ష్యంతో శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ప్రారంభించగా... రోహిత్ శర్మ 12 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోహ్లీతో కలిసి ధావన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు. రెండో వికెట్‌కి 61 పరుగులు జోడించారు. అయితే 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ధావన్ ఔట్ కాగా.. ఆ తర్వాత వెంటనే రిషబ్ పంత్(4) పెవిలియన్ చేరాడు. కానీ, విరాట్ కోహ్లీ మాత్రం పట్టువదలకుండా బ్యాటింగ్ చేశాడు. హాఫ్ సెంచరీ బాదేశాడు.. 52 బంతుల్లో 72 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.. దీంతో 19 ఓవర్లలో 151 పరుగులు చేసిన టీమిండియా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.