కోహ్లీ, బుమ్రాకు రెస్ట్..

కోహ్లీ, బుమ్రాకు రెస్ట్..

కెప్టెన్ విరాట్ కోహ్లీ, కీలక ఆటగాడు బుమ్రాను జట్టుకు దూరం కానున్నారు.. అదేంటి వరల్డ్ కప్‌లో జరుగుతోన్న మ్యాచ్‌లు కీలక దశకు చేరుకున్న సమయంలో ఈ నిర్ణయం ఏంటి అనే డౌట్ వెంటనే రావొచ్చు... కానీ, ఈ మెయిన్ ప్లేయర్స్‌కి ఐసీసీ వరల్డ్ కప్ తర్వాత రెస్ట్ ఇవ్వనున్నారు. వరల్డ్ కప్ తర్వాత వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌, వన్డే సిరీస్‌ ఆడనుంది టీమిండియా. ఈ రెండు సిరీస్‌ల సమయంలో విరాట్‌ కోహ్లీ, బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపారు. యునైటెడ్‌ స్టేట్స్‌లో ఆగస్టు 3వ తేదీ నుంచి వెస్టిండీస్‌తో మూడు టీ20లు, మూడు వన్డేలకు కోహ్లీ, బుమ్రా దూరం కానున్నారు. విరామం లేకుండా వరుసగా మ్యాచ్‌లు ఆడుతున్న కోహ్లీ, బుమ్రాపై ఒత్తిడి తగ్గించడానికే విశ్రాంతి ఇవ్వనున్నట్టు వెల్లడించారు. అయితు, టీ20, వన్డే సిరీస్‌లకు దైరమైన ఆ తర్వాత ఆగస్టు 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న టెస్ట్‌ సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నారు.