విరాట్ కోహ్లీ సెంచరీ

విరాట్ కోహ్లీ సెంచరీ

ఐదు వన్డే సిరీస్‌లో భాగంగా నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో టీంఇండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ (100; 107 బంతుల్లో 9×4) సెంచరీ చేసాడు. కూల్టర్‌ నీల్ బౌలింగ్ లో బౌండరీ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. దీంతో వన్డే ఫార్మాట్‌లో కోహ్లీ ఖాతాలో 40వ సెంచరీ చేరింది. ఈ మ్యాచ్‌లో ఓవైపు సహచరులంతా పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. ఒంటరి పోరాటం చేసి భారత్‌కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. విజయ్ శంకర్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 81 పరుగులు.. జ‌డేజాతో క‌లిసి ఏడో వికెట్‌కు 67 ప‌రుగులు జోడించాడు. ఈ క్రమంలోనే కోహ్లీ సెంచరీ సాధించాడు.