టాప్‌ ప్లేస్ కోల్పోయిన కోహ్లీ

టాప్‌ ప్లేస్ కోల్పోయిన కోహ్లీ

భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టుల్లో తన టాప్‌ ర్యాంకును కోల్పోయాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్మిత్‌ మళ్లీ అగ్రస్థానంలోకి దూసుకొచ్చాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్టులో సెంచరీతో రాణించిన కోహ్లి.. రెండో టెస్టులో దారుణంగా విఫలమయ్యాడు. లార్డ్స్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో 23, 17 పరుగులు చేసాడు. దీంతో 15 పాయింట్స్ కోల్పోయి 919 పాయింట్స్ తో రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు. స్మిత్‌ 929 పాయింట్స్ తో టాప్ లో ఉన్నాడు. ఇక టాప్ 10 లో భారత్ తరుపున చతేశ్వర్‌ పుజారా ఆరో ర్యాంకులో ఉన్నాడు.

బౌలర్ల జాబితాలో ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ అగ్రస్థానంలో ఉన్నాడు. లార్డ్స్ టెస్టులో 9 వికెట్లు తీయడంతో అతని ఖాతాలో 19 పాయింట్స్ చేరాయి. దీంతో అండర్సన్‌ తొలిసారి 903 రేటింగ్‌ పాయింట్లను సాధించాడు. 1980లో బోథమ్‌ తర్వాత 900 మార్క్‌ చేరిన ఇంగ్లండ్‌ ఆటగాడిగా అండర్సన్‌ రికార్డులోకి ఎక్కాడు. 900 పాయింట్ల మార్క్‌ను అందుకున్న ఏడో ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జిమ్మీ. ప్రొటీస్ బౌలర్ కాగిసో రబాడ(882) రెండవ స్థానంలో ఉన్నాడు.

ఆల్‌రౌండర్ల జాబితాలో అశ్విన్‌ మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. జడేజా రెండో ర్యాంకులో ఉన్నాడు. అగ్రస్థానంలో బంగ్లాదేశ్ ఆటగాడు షకీబ్ అల్ హాసన్ కొనసాగుతున్నాడు.