పింక్‌బాల్ టెస్ట్.. కోహ్లీ రికార్డుల మోత..

పింక్‌బాల్ టెస్ట్.. కోహ్లీ రికార్డుల మోత..

పింక్‌ బాల్‌ టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ రికార్డులు మీద రికార్డులు కొల్లకొడుతున్నాడు. టెస్టు ఫార్మాట్‌లో కెప్టెన్‌గా ఐదు వేల పరుగుల్ని వేగవంతంగా పూర్తి చేసిన రికార్డే కాకుండా, పింక్‌ బాల్‌ టెస్టులో సెంచరీ సాధించిన తొలి భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు కోహ్లీ. టెస్టుల్లో ఒక కెప్టెన్‌గా అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో స్థానంలోకి దూసుకెళ్లాడు. ఇక ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన ఆటగాళ్ల జాబితాలో ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాటింగ్ తరువాత స్థానాన్ని ఆక్రమించాడు కోహ్లీ.