కోహ్లీ ఓ వేటగాడు..! మరిన్ని రికార్డులు బ్రేక్..

కోహ్లీ ఓ వేటగాడు..! మరిన్ని రికార్డులు బ్రేక్..

టీమిండియా కెప్టెన్ రికార్డులను వేటాడేస్తున్నాడు.. కెప్టెన్‌గా, బ్యాట్స్‌మన్‌గా కొత్త రికార్డులు సృష్టిస్తూ ముందుకు సాగుతున్నాడు. కోహ్లీ తీరు చూస్తుంటే రికార్డుటను తిరగరాసే ఓ వేటగాడిగా.. పాత రికార్డులను వేటాడేస్తూ.. సరికొత్త రికార్డులు నెలకొల్పుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక, పూణె టెస్టు విజయంతో టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ ఖాతాలో మరిన్ని రికార్డులు వచ్చి చేరాయి. తొలి 50 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో...  30 విజయాలు సాధించి మూడో స్థానంలో నిలిచాడు విరాట్ కోహ్లీ.  టీమిండియా ఇన్నింగ్స్‌ పరుగుల తేడాతో విజయం సాధించడం విరాట్‌ కోహ్లీకి ఇది ఎనిమిదో సారి. అంతకంటే ముందు తొమ్మిది సార్లు గెలిపించిన కెప్టెన్‌గా ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు. దక్షిణాఫ్రికాపై భారీ విజయం సాధించిన భారత కెప్టెన్‌ మాత్రం కోహ్లీనే. సెకండ్ టెస్టులో డబుల్ సెంచరీతో కదం తొక్కిన విరాట్.. భారత్ తరపున అత్యధిక ద్విశతకాలు సాధించిన ఆటగాడిగా మరో మైలు రాయి అందుకున్నాడు. అంతేకాదు, భారత కెప్టెన్‌లలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు బాదిన కెప్టెన్ కూడా విరాట్ కోహ్లీనే కావడం విశేషం.