ఇలా జరుగుతుందని ఊహించలేదు: కోహ్లీ
వరల్డ్‌కప్ చివరి దశకు చేరుకుంది. సెమీస్‌లో భారత్-న్యూజిలాండ్ జట్లు రేపు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ఓ విశేషం ఉంది. అదేంటంటే.. ఇప్పుడు ఈ రెండు జట్లకూ సారథ్యం వహిస్తున్న విరాట్‌కోహ్లీ, కేన్ విలియమ్సన్‌లు గతంలోనూ ప్రపంచకప్ సెమీస్‌లో కెప్టెన్లుగా వ్యవహరించారు. 2008 అండర్-19 వరల్డ్‌కప్‌లో ఇండియా, న్యూజిలాండ్ జట్లు సెమీస్‌లో తలపడగా.. అప్పుడు ఆ రెండు జట్లకూ కోహ్లీ, విలియమ్సన్‌లే కెప్టెన్లు. ఇదే విషయంపై కోహ్లీ స్పందించాడు. ఇలా జరుగుతుందని తానుగాని, విలియమ్సన్గాని ఊహించలేదన్నాడు. 11 ఏళ్ల తర్వాత ఇద్దరమూ జాతీయ జట్లకు వరల్డ్‌కప్‌లో కెప్టెన్సీ చేయడం గొప్ప విషయమని అన్నాడు. 2008లో జరిగిన సెమీఫైనల్స్ మ్యాచ్‌లో ఆడిన ఆటగాళ్లు ఇరు జట్లలోఅనేక మంది ఉన్నారని అన్నాడు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)