ఒక్క రాత్రి కాదు... ఆరు సంవత్సరాలు పట్టింది : కోహ్లీ

ఒక్క రాత్రి కాదు... ఆరు సంవత్సరాలు పట్టింది : కోహ్లీ

ఆరు ఏడు సంవత్సరాల పాటు తన క్రికెట్ చర్యలను ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న మహేంద్ర సింగ్ ధోనికి తాను కెప్టెన్ గా ఎదగడం లో ముఖ్యమైన పాత్రా ఉందని విరాట్ కోహ్లీ అన్నారు. సహచరుడు రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ చాట్ సందర్భంగా, కోహ్లీ తాను ఎప్పుడూ బాధ్యత తీసుకోవడంలో ఎలా ఆసక్తిగా ఉన్నానో, భారత కెప్టెన్ కావడం ఆ ప్రక్రియలో ఒక భాగమని మాట్లాడారు. నేను కెప్టెన్ అవ్వడంలో చాలా భాగం ధోని నన్ను చాలా కాలం పాటు గమనించడం అని నేను అనుకుంటున్నాను. అతను వెళ్లి తర్వాత 'మీరు కెప్టెన్ అవుతారు' అని నేరుగా ఏమి చెప్పలేదు అని కోహ్లీ సమాధానం ఇచ్చారు. జట్టు నాయకుడిగా మారే ప్రక్రియ ఆరు సంవత్సరాలు జరిగింది అని అన్నారు. "అక్కడ ఉన్న వ్యక్తి, అతను బాధ్యత తీసుకుంటాడ లేదా అనేది ముందు ధోని చూసాడు. ఆ నమ్మకాన్ని మీరు పెంచుకోవాలి, దానికి ఆరు ఏడు సంవత్సరాలు సమయం పట్టింది, ఇది ఒక్క రాత్రిపూట జరగలేదు అని కోహ్లీ అన్నారు. "నేను ఎప్పుడూ ధోని ప్రక్కన నిలబడి, మనం వీటిని ప్రయత్నించగలమా, మీరు ఏమనుకుంటున్నారు అని చాల ప్రశ్నలు అడిగేవాడిని, అయితే అతను చాలా విషయాలు తిరస్కరించాడు కాని తర్వాత చాలా విషయాలు కూడా చర్చిస్త, కాబట్టి నేను అతని తర్వాత కెప్టెన్ గా చేయగలనని అతనికి చాలా నమ్మకం వచ్చింది "అని అశ్విన్‌తో కెప్టెన్ కోహ్లీ చెప్పాడు.