క్రిస్ట్‌చర్చ్‌ ఘటనపై దిగ్బ్రాంతికి లోనయ్యా: కోహ్లీ

క్రిస్ట్‌చర్చ్‌ ఘటనపై దిగ్బ్రాంతికి లోనయ్యా: కోహ్లీ

శుక్రవారం న్యూజిలాండ్‌లోని క్రిస్ట్‌చర్చ్‌ నగరంలో మసీదులే లక్ష్యంగా దుండగులు కాల్పులు జరిపారు. ప్రార్థన సమయంలో దుండగులు కాల్పులకు తెగబడటంతో.. 49 మంది మృతి చెందారు. మరో 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి సమయంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టు సభ్యులు మసీదులో ఉన్నారు. ఈ ఘటనతో బంగ్లా క్రికెటర్లు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. 'అదొక షాకింగ్ మరియు విషాద ఘటన. క్రిస్ట్‌చర్చ్‌ నగరంలో జరిగిన ఘటన నన్ను బాధిస్తోంది. చనిపోయిన వారి గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నా. అలాగే బంగ్లాదేశ్‌ క్రికెట్‌ ఆటగాళ్ల గురించి కూడా. వారు సురక్షితంగా ఉన్నారు' అని కోహ్లీ ట్విట్టర్ వేదికగా తెలిపారు.