ఎవరైనా అడిగితే నాది ఇచ్చేస్తా అంటున్న విరాట్...

ఎవరైనా అడిగితే నాది ఇచ్చేస్తా అంటున్న విరాట్...

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటగాళ్లలో ఒక్కడు. ఫోర్బ్స్ 2020 సంవత్సరానికి అత్యధిక పారితోషికం పొందిన టాప్ 100 అథ్లెట్ల జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక క్రికెటర్ కూడా. అయితే, భారత క్రికెట్‌లో తాను పోషిస్తున్న పాత్రతో పాటు వచ్చే పేరు, ప్రతిష్టలు తనకు పెద్దగా ఇష్టం లేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. తనను అడిగినట్లయితే, సాధారణ జీవితాన్ని గడపడానికి రెండవ ఆలోచన లేకుండా తన కీర్తిని ఎవరికైనా ఇచ్చేస్తాను అని కోహ్లీ చెప్పాడు. విరాట్ కోహ్లీ 'రెమినిస్ విత్ యాష్' చివరి ఎపిసోడ్ కోసం ఇండియా ఆఫ్ స్పిన్నర్ ఆర్ అశ్విన్‌తో ఈ వ్యాఖ్యలు చేశారు.

అసలు నిజం చెప్పాలంటే, నేను క్రీడను ప్రేమిస్తున్నాను, మీరు (అశ్విన్) కూడా బాగా ఆడుతారు అని నాకు తెలుసు. ప్రజలను ఉత్తేజపరిచే ఏదో ఒకటి చేసే అవకాశాన్ని నేను ప్రేమిస్తున్నాను. మీ దేశం కోసం ఆడటం ఏ క్రీడాకారుడికీ పెద్ద గౌరవం" అని కోహ్లీ అశ్విన్‌తో అన్నారు.అంతక ముందు ఎవరికైనా తిరగడానికి చాలా ఎక్కువ స్వేచ్ఛ ఉంది. ఎందుకంటే అప్పుడు కెమెరా ఫోన్లు ఎప్పుడూ లేవు. అయితే అనుష్క మరియు నేను ఇద్దరూ మా ఇళ్ళ వద్ద మామూలు పనులు చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. అందుకే ఎవరైనా నా కీర్తి  తమకు కావాలని నాకు చెబితే నేను దానిని వెంటనే ఇచ్చేస్తాను అని తెలిపాడు.