ధోనీపై దాదా కీలక వ్యాఖ్యలు.. ఆ ఇద్దరి చేతిలోనే భవిష్యత్‌!

ధోనీపై దాదా కీలక వ్యాఖ్యలు.. ఆ ఇద్దరి చేతిలోనే భవిష్యత్‌!

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ తర్వాత మిస్టర్ కూల్, మాజీ సారథి ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ పక్కా అనే ప్రచారం జరిగింది.. ఆ తర్వాత వెస్టిండీస్‌కు టూర్‌ గానీ.. ప్రస్తుతం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరుగుతోన్న టీ-20 సిరీస్‌కు సైతం ధోనీని సెలక్ట్ చేయలేదు. మరోవైపు వరల్డ్ కప్ తర్వాత ఇండియన్‌ ఆర్మీలో కొన్ని రోజులు విధులు నిర్వహించారు ధోనీ.. అయితే.. ధోనీ క్రికెట్ కెరీర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ భవిష్యత్‌ అంతా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సెలెక్లర్ల చేతిలో ఉందని వ్యాఖ్యానించారు. నాకు తెలిసి ధోనీ టీమిండియాలో మళ్లీ ఆడాలంటే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాలని చెప్పుకొచ్చాడు దాదా. 

ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ జట్టుతో తన భవిష్యత్తు గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు, చాలా మంది మాజీ క్రికెటర్లు ఎంఎస్ ధోనీ తన భవిష్యత్తును స్వయంగా నిర్ణయించుకోవాలని భావిస్తున్నారు. అయితే, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం.. విరాట్ కోహ్లీ, సెలెక్టర్లు.. ఎంఎస్ ధోనీ భవిష్యత్తు గురించి నిర్ణయించాలని భావిస్తున్నారు. సెలెక్టర్లు ఏమనుకుంటున్నారో, విరాట్ ఏమనుకుంటున్నారో నాకు తెలియదు... కానీ, వారు ముఖ్యమైన వ్యక్తులు, వారే ధోనీ కెరీర్‌పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు.