అనుష్క ఒడిలో విరాట్.. క్షణాల్లో వైరల్..!!

అనుష్క ఒడిలో విరాట్.. క్షణాల్లో వైరల్..!!

అనుష్క శర్మ.. వివాహం తరువాత భర్త విరాట్ కోహ్లీతో కలిసి షికార్లు చేస్తున్నది.  ఇండియా టీమ్ కరేబియన్ దీవుల్లో సందడి చేసిన సంగతి తెలిసిందనే.  వన్డే, టి20, టెస్ట్ ఇలా మూడు ఫార్మాట్లో కూడా ఇండియా విజయం సాధించింది.  క్రికెట్ ఉన్నప్పుడు గేమ్ ఆడుతూ.. సమయం దొరికినపుడు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి కరేబియన్ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.  

అక్కడి నుంచి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నది అనుష్క శర్మ.  తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది అనుష్క.  అనుష్క ఒడిలో విరాట్ కోహ్లీ తలపెట్టుకొని పడుకొని ఉన్న ఫోటో అది.  ఆ ఫోటోను సోషల్ మీడియాలో  పోస్ట్ చేశాడు విరాట్.  ఈ ఫోటో రెండు గంటల్లోనే 17 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.  క్షణాల్లో వైరల్ అయ్యింది ఈ ఫోటో.