విశాఖ టీ20: అభిమానులకు కోహ్లీ సైగలు

విశాఖ టీ20: అభిమానులకు కోహ్లీ సైగలు

ఆదివారం విశాఖ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌ లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో పుల్వామా ఉగ్రదాడిలో చనిపోయిన అమర జవాన్లకు భారత్‌, ఆస్ట్రేలియా జట్లు నివాళులు అర్పించాయి. రెండు దేశాల జాతీయ గీతాలాపన అనంతరం ఆటగాళ్లతో పాటు సహాయక  సిబ్బంది 2 నిమిషాల పాటు మౌనం పాటించారు.

చాలా కాలం తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుండడంతో.. స్టేడియంలోని అభిమానులు తమ అభిమాన ఆటగాళ్లను చూసి కేరింతలు కొట్టారు. ఇక అమరులకు నివాళి అర్పిస్తున్న సమయంలో కూడా అభిమానులు గోల చేశారు. దీంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వారి పైపు తిరిగి నిశ్శబ్దంగా ఉండండి అంటూ సైగ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.