కోహ్లీ మరో అరుదైన రికార్డు.. దాదా రికార్డు బద్దలు..

కోహ్లీ మరో అరుదైన రికార్డు.. దాదా రికార్డు బద్దలు..

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ట్విటర్‌ వేదికగా పంచుకుంది. భారత్‌ తరపున దాదా 2000 నుంచి 2005 మధ్యన 49 టెస్టులకు సారథ్యం వహించాడు. ఇప్పుడు విరాట్‌ ఆ రికార్డును తిరగరాశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు అతడు నాయకత్వం వహిస్తున్న 50వ మ్యాచ్‌. భారత్‌ తరఫున అత్యధిక టెస్టులకు కెప్టెన్సీ చేసిన ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ. 2008 నుంచి 2014 మధ్యన అతడు 60 టెస్టులకు సారథ్యం వహించాడు. అంటే మరో 10 మ్యాచులు ఆడితే విరాట్‌ ఈ రికార్డునూ తుడిచేస్తాడు.