కోహ్లి మరో రికార్డు...

కోహ్లి మరో రికార్డు...

ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లి మరో ఘనతను సాధించాడు. టెస్టులలో విదేశీ పిచ్ లపై అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. నాటింగ్‌హామ్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో విరాట్‌ ఈ ఘనతను సాధించాడు. ఇప్పటివరకు అగ్రస్థానంలో ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ(1693)ని వెనక్కినెట్టి.. 1731 పరుగులతో కోహ్లీ టాప్ లోకి దూసుకొచ్చాడు.

మూడో టెస్టుకు ముందు గంగూలీ కంటే 59 పరుగుల వెనుకంజలో ఉన్నాడు కోహ్లి. తొలి ఇన్నింగ్స్‌లో 97 పరుగులు చేయడంతో గంగూలీని వెనక్కినెట్టి కోహ్లి అగ్రస్థానాన్ని చేరుకున్నాడు. గంగూలీ 28 టెస్టుల ద్వారా 1693 పరుగులు చేస్తే.. కోహ్లీ కేవలం 19 టెస్టులో 1731 పరుగులు చేసాడు. భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని(1,591) మూడో స్థానంలో ఉన్నాడు. మొహ్మద్‌ అజహరుద్దీన్‌ (1,717), రాహుల్‌ ద్రవిడ్‌ (1,219) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.