అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ..

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో కోహ్లీ..

టీమిండియా కెప్టెన్ మరో అరుదైన రికార్డుకు చేరువయ్యాడు.. వెస్టిండీస్ పర్యటనలో వరుసగా సెంచరీలు చేసిన టీమిండియా సారథి.. మరో సెంచరీ కొడితే.. వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన కెప్టెన్‌గా రికార్డు సృష్టిస్తారు. భారత్-విండీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో తన 43 సెంచరీని పూర్తిచేసుకున్న విరాట్.. ఇక, వన్డేల్లో అత్యధిక శతకాలు సాధించిన కెప్టెన్ల జాబితాలో 21 సెంచరీలతో రెండో స్థానంలో నిలిచాడు.. ఈ  జాబితాలో 22 సెంచరీలతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ప్రస్తుతం టాప్ స్పాట్‌లో ఉన్నాడు. మరోవైపు ఒక జట్టుపై అత్యధిక సెంచరీలు బాదేసిన బ్యాట్స్‌మెన్‌గా.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ సరసన చేరాడు కోహ్లీ.. సచిన టెండూల్కర్.. ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేయగా.. కోహ్లీ.. వెస్టిండీస్ జట్టుపై 9 సెంచరీలు చేశాడు. ఒక, వన్డేలో ఇంకో సెంచరీ చేస్తే రికీ పాంటింగ్ రికార్డును సమం చేయనున్న కోహ్లీ.. మరో సెంచరీ బాదేస్తే పాంటింగ్‌ రికార్డు బద్దలైపోతుంది.