11 ఏళ్ల కెరీర్‌పై టీమిండియా కెప్టెన్ భావోద్వేగం

11 ఏళ్ల కెరీర్‌పై టీమిండియా కెప్టెన్ భావోద్వేగం

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌ను ప్రారంభించి 11 ఏళ్లు అవుతోంది. ఓ ఆటగాడిగా జట్టులోకి వచ్చిన కోహ్లీ.. టీమిండియా పగ్గాలు చేపట్టాడు. మిస్టర్ కూల్ నుంచి ఒక్కొక్కటిగా.. టెస్ట్, వన్డే, టీ-20 ఇలా అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీని దక్కించుకున్నాడు విరాట్. అయితే, తన 11 ఏళ్ల క్రికెట్ కెరీర్‌పై భావోద్వేగపూరిత పోస్టును సోషల్ మీడియాలో పెట్టాడు కోహ్లీ. "2008లో కుర్రాడిగా భారత జట్టులో అడుగుపెట్టిన తాను.. 11 ఏళ్ల ప్రయాణంలో ఇంత సాధిస్తానని కలలో కూడా ఊహించలేదు.. దేవుడి ఆశీస్సుల వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని పేర్కొన్న టీమిండియా కెప్టెన్.. సరైన మార్గంలో తమ కలలను సాకారం చేసుకోవాలని, అందుకు కావాల్సిన శక్తి సామర్థ్యాలను సొంతం చేసుకోవాలి" అంటూ అభిమానులకు సూచించారు. ఇక, తన సుదీర్ఘ ప్రయాణంలో అడుగడుగునా తనకు సహాయం చేసిన ప్రతీ ఒక్కరికీ రుణపడి ఉంటానంటూ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు విరాట్ కోహ్లీ. మరోవైపు తనకు 19 ఏళ్ల వయస్సులో 2008 ఆగస్టు 18న శ్రీలంకతో జరిగిన వన్డేతో ఇంటర్నేషనల్ క్రికెట్‌ను ప్రారంభించిన కోహ్లీ.. క్రమంగా తన బ్యాటింగ్‌కు పదునుపెడుతూ పలువురు క్రికెట్ లెజెండ్స్ నెలకొల్పిన రికార్డులను బద్దలు కొడుతూ పరుగుల మిషన్‌గా పేరుతోచుకున్నాడు. ఈ రికార్డులు పదిలం.. వీటిని ఎవరూ టచ్ చేయలేరనే తేడాలేకుండా ఎన్నో శిఖరాలను అదిరోహించాడరు. తన కెరీర్‌లో 239 వన్డేలు, 77 టెస్టులు, 70 టీ20లు పూర్తి చేసుకున్నాడు.