విరాట్ కోహ్లీతో సన్నీలియోన్ ...?

విరాట్ కోహ్లీతో సన్నీలియోన్ ...?

హెడ్ లైన్ చూసి షాక్ అవుతున్నారా... అందరు అదే షాక్ లో ఉన్నారు.  విరాట్ కోహ్లీ తో సన్నీ లియోన్ ఏంటి అనే డౌట్ అందరికి వస్తుంది.  అది ముంబై ఎయిర్ పోర్ట్ లో.  ఎయిర్ పోర్ట్ అన్న తరువాత చాలా మంది వస్తుంటారు పోతుంటారు.  అంతమాత్రానికే ఇలా రాస్తారా అనుకుంటున్నారేమో.  ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఎయిర్ పోర్ట్ లోకి వెళ్లారట.  దీనికి సంబంధించిన వీడియో కూడా ఉంది.  సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్ విరాల్ భయాని కూడా ఈ దృశ్యాన్ని చూశాడు.  

ఇది నిజమేనా.. విరాట్ తో సన్నీలియోన్... సన్నీలియోన్ మాట వాస్తవమే గాని, ఆ పక్కన ఉన్నది విరాట్ కోహ్లీ కాదు.  అచ్చు విరాట్ పోలికలతో ఉన్న రజాని.  సన్నీ లియోన్ మేనేజర్.  మొదట ఎయిర్ పోర్ట్ లో చూసిన వాళ్లంతా విరాట్ కోహ్లీనెమో అనుకున్నారు.  పట్టిపట్టి చూస్తేనే గాని విరాట్ కాదని గుర్తించలేము.  ఈ దృశ్యాన్ని అనుష్క శర్మ చూసుంటే ఎలా ఫీలయ్యేదో మరి.