కోహ్లీకి అంతలేదు...
ఓ ఆటగాడిని మానసికంగా దెబ్బతీయాలనుకుంటే... ఆసీస్ ఆటగాళ్లు ముందే మైండ్ గేమ్ మొదలు పెడతారు. గత ఏ సిరీస్‌లు తీసుకున్న ఇది అర్థమైపోతుంది. అయితే ఈ ఏడాదిలో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది భారత జట్టు... ఈ పర్యటనకు ఇంకా సమయం ఉన్నా... సూపర్ ఫామ్‌లో ఉన్న టీమిండియాను, ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీని టార్గెట్ చేసి అప్పుడే ఆసీస్ జట్టు మైండ్‌గేమ్ మొదలు పెట్టింది. రెచ్చగొట్టి... మానసిక స్థెర్యాన్ని దెబ్బతీసే వ్యాఖ్యలుకు పూనుకుంది ఆ జట్టు... తన మైంగ్ గేమ్ ప్లాన్‌లో భాగంగా... ఆసీస్ క్రికెటర్ పాట్ కమిన్స్ విరాట్‌ను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశాడు. సిడ్నీలో జరిగిన ఓ కార్యక్రమంలో కమిన్స్ మాట్లాడుతూ... నేను ధైర్యంగా జోస్యం చెబుతున్నా. ఆసీస్ టూర్లో విరాట్ కోహ్లీ సెంచరీ చేయలేడు అని వ్యాఖ్యానించాడు. భారత జట్టును ఆసీస్ గడ్డపై పూర్తిగా కట్టడిచేస్తామని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఏడాదిలోనే ఆసీస్ గడ్డపై నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది భారత జట్టు... కాగా, ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో ఎనిమిది టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ... సగటున 53.40 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై టెస్ట్‌ల్లో ఐదు సెంచరీలు కూడా బాదేశాడు టీమిండియా కెప్టెన్. అయితే సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌తో మాజీ క్రికెటర్ మెక్‌గ్రాత్ మాట్లాడుతూ... ఆసీస్ విజయం సాధించాలంటే ముందుగా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి పెంచాలి. సిరీస్‌ను గెలవాలంటే కోహ్లీనే టార్గెట్‌గా వ్యూహాత్మకంగా ఆడాలని సూచించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)