వారిద్దరి వైరం టీం ఇండియా కొంపముంచుతుందా..?

వారిద్దరి వైరం టీం ఇండియా కొంపముంచుతుందా..?

భారత కెప్టెన్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలున్నాయని గతేడాది గా ప్రచారం జరుగుతుంది. ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా రోహిత్, విరాట్ కనీసం ఒకరికొకరు చూసుకోలేదు. తాజాగా రోహిత్‌ శర్మ గాయం గురించే తనకు పూర్తి సమాచారం లేదని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వెల్లడించడం అందర్ని విస్మయానికి గురిచేసింది. అలాగే మాతో రోహిత్‌ ఎందుకు ప్రయాణించడం లేదో మాకెవరికీ సమాచారం లేదు.'అని కోహ్లీ చెప్పుకొచ్చాడు. అయితే కమ్యూనికేషన్ విస్తరించిన ఈ యుగంలో కూడా రోహిత్‌కు ఏమైందో తెలియదని విరాట్ చెప్పడం విచారకరమని భారత మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అసహనం వ్యక్తం చేశాడు. రోహిత్ శర్మ గాయం గురించి తనకేం తెలియదని కోహ్లీ అంటున్నాడు. ఈ మాటలు నన్ను బాధపెట్టాయి అని నెహ్రా పేర్కొన్నాడు. బీసీసీఐ సమాచారం ఇవ్వకపోయినా.. కోహ్లీకి ఏమైందని, అతనైనా నేరుగా రోహిత్‌తో మాట్లాడవచ్చు కదా? అని మరికొంతమంది విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఓ కెప్టెన్, వైస్ కెప్టెన్ మధ్య ఫోన్ చేసుకునే వాతావరణం లేకపోవడం జట్టుకు ప్రమాదమే అని పేర్కొన్నారు.