విరాట పర్వం నుంచి తాజా పోస్టర్

విరాట పర్వం నుంచి తాజా పోస్టర్

రానా, సాయి పల్లవి జంటగా నటించిన సినిమా విరాట పర్వం. ఈ సినిమా నక్సల్ నాయకుడు రవన్న కథ ఆధారంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో రవన్న పాత్రలో రానా నటించారు. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వంలో సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో సాయి పల్లవి, ప్రియమణి, నివేథా పేతురాజ్, నందితా దాస్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్‌లు, టీజర్, గ్లింప్స్‌ అన్నీ కూడా సినిమాపై అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి సరికొత్త మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ రోజు మహిళా దినోత్సవ సందర్బంగా ఈ సినిమాలో నటించిన మహిళలతో ఓ పోస్టర్‌ను సిద్దం చేశారు. ఆ పోస్టర్‌నే నేడు విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు ఈ పోస్టర్‌ను తెగ షేర్ చేస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు వేణు ఊడుగుల యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందించారు. ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా రానా అభిమానుల అంచనాలను ఏమాత్రం అందుకుంటారో వేచి చూడాలి.