విరాట పర్వం కథ ఇదే.!!

విరాట పర్వం కథ ఇదే.!!

రానా డిఫరెంట్ స్టోరీలను ఎంచుకొని సినిమాలు చేస్తున్నాడు.  లీడర్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరో.. ఆ తరువాత డిఫరెంట్ కథలు చేస్తూ..విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు.  సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ లతో పాటు బాలీవుడ్ లో కూడా దూసుకుపోతున్నాడు.  

ఇప్పుడు ఈ హీరో విరాట పర్వం అనే సినిమా చేస్తున్నాడు.  నీది నాది ఒకటే కథ అనే మూవీ దర్శకుడు వేణు ఉడుగుల ఈ సినిమాకు దర్శకుడు.  సాయి పల్లవి హీరోయిన్.  ఇదిలా ఉంటె, ఈ సినిమాకు సంబంధించిన కథ ఇదే అని లీక్ అయింది.  దాని ప్రకారం, సాయి పల్లవి ఓ రిపోర్టర్.  రానా ఇందులో నక్సలైట్ గా చేస్తున్నాడు.  అతనిని ఇంటర్వ్యూ చేసేందుకు సాయి పల్లవి అడవిలోకి వెళ్తుంది.  

ఆ ఇంటర్వ్యూ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ పుడుతుంది.  అక్కడి నుంచి రానా బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తాడు.  ఆ తరువాత ఏం జరిగింది అన్నది కథ.  పాయింట్ ఇంటరెస్ట్ గా ఉండటంతో సినిమాపై ఆసక్తి కలుగుతున్నది.  రిలీజ్ అయితేనే గాని సినిమా ఎలా ఉంటుందో చెప్పలేం.