సమస్యలన్నీ ఆయనకు తెలుసు.. దాదాయే సరైనోడు..!

సమస్యలన్నీ ఆయనకు తెలుసు.. దాదాయే సరైనోడు..!

టీమిండియా మాజీ కెప్టెన్, భారత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపిన సౌరవ్ గంగూలీ ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించారు.. బీసీసీఐ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన దాదా.. టీమిండియాలో కీలక మార్పులు చేస్తారని అంతా అంచనా వేస్తున్నారు. ఇక, దేశవాళీ క్రికెట్‌ను అభివృద్ధి చేయడానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీనే సరైనోడు అని అభిప్రాయపడ్డాడు సెహ్వాగ్‌. దేశవాళీ క్రికెట్‌లోని సమస్యలన్నీ దాదాకు తెలుసునని, టీమ్‌ఇండియాలో స్థానం కోల్పోయినప్పుడు దేశవాళీ క్రికెట్‌ ఆడుతూ దేశమంతటా పర్యటించాడని చెప్పుకొచ్చాడు. ఆటగాళ్లు విఫలమవుతున్నా ఉత్తేజపరుస్తూ వారిలో దాదా ఆత్మవిశ్వాసం నింపేవాడని అన్నారు సెహ్వాగ్‌. దీంతో వారు అద్భుత ప్రదర్శన చేసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారని గుర్తు చేశారు వీరు. కాగా, దాదా కెప్టెన్‌గా ఉన్నప్పుడు సెహ్వాగ్ ఓ వెలుగు వెలిగిన సంగతి తెలిసిందే.. టీమిండియా విజయాల్లో వీరూ కీలక పాత్ర పోషించారు.