'వెరీ పెయిన్‌పుల్'.. రాయుడు రిటైర్మెంట్‌పై సెహ్వాగ్

'వెరీ పెయిన్‌పుల్'.. రాయుడు రిటైర్మెంట్‌పై సెహ్వాగ్

తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు ఇంటర్నేషనల్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్‌ సహా అన్ని ఫార్మాట్లకూ వీడ్కోలు పలుకుతూ సంచలన ప్రకటన చేశాడు అంబటి రాయుడు. ఐసీసీ వరల్డ్ కప్‌కు తనను ఎంపిక చేయకపోవడంతో మనస్తాపానికి గురైన రాయుడు ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. విజయ్‌ శంకర్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి తప్పుకోవడంతో... ఆ స్థానంలో రాయుడిని తీసుకుంటారని అంతా భావించిన తరుణంలో మయాంక్ అగర్వాల్‌ను జట్టులోకి తీసుకోవడంతో ఆవేదనకు గురైన రాయుడు.. అవకాశం రాలేదన్న నిరాశతో రిటైర్మెంట్ ప్రకటించారని తెలుస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్... "అంబటిరాయుడును వరల్డ్‌కప్‌లో విస్మరించబడటం ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయమన్న సెహ్వాగ్... కానీ, రిటైర్మెంట్ తర్వాత రాయుడుకు తన జీవితంలో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు.