మళ్లీ జట్టులోకి ధోనీ..? సెహ్వాట్ హాట్ కామెంట్స్...

మళ్లీ జట్టులోకి ధోనీ..? సెహ్వాట్ హాట్ కామెంట్స్...

టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ ఎంఎస్ ధోనీ రీ ఎంట్రీపై ఎప్పటి నుంచో చర్చ జరుగుతూనే ఉంది. క్రికెట్ వరల్డ్ కప్ ముగిసిన తర్వాత... జట్టుకు దూరమైన ధోనీ.. జట్టులో మళ్లీ చోటు దక్కించుకుంటాడని... అతడికి అన్ని అర్హతలు ఉన్నాయని కొందరు సీనియర్లు చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. హాట్ కామెంట్లు చేశారు. అసలు, ధోనీకి భారత జట్టులో చోటెక్కడుంది? అని ప్రశ్నించారు సెహ్వాగ్.. ఇప్పటికే రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ మంచి ఫామ్‌లో ఉన్నారన్న వీరూ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లలో రాహుల్ అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడని, ఇంకా అతడి గురించి ఆలోచించేందుకు వేరే కారణం ఏముంటుంది? అని ప్రశ్నించారు. అంటే.. పరోక్షంగా ఇక ధోనీ టీమిండియాలోకి మళ్లీ రావడం ఇక కష్టమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు సెహ్వాగ్. ఐపీఎల్‌లో బాగా ఆడితే ప్రపంచ కప్ జట్టుకు ధోనీ పేరును పరిశీలిస్తామని రవిశాస్త్రి పేర్కొన్న నేపథ్యంలో.. కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడింది.. ఇక, ధోనీ తిరిగి ఆడటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో సెహ్వాగ్ చేసిన కామెంట్లు చర్చగా మారాయి.