జనసేన అధినేత పవన్ కు షాక్

జనసేన అధినేత పవన్ కు షాక్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు షాక్ తగిలింది. జనసేన విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించిన గేదెల శ్రీనివాస్ శనివారం వైసీపీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాగా ఇటీవల పవన్‌ కల్యాణ్‌ లోక్‌సభకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో గేదెల శ్రీనివాస్‌ పేరును ప్రకటించారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది.