అభిమ‌న్యుడు తొలివీకెండ్‌ ధ‌మాకా

అభిమ‌న్యుడు తొలివీకెండ్‌ ధ‌మాకా

గ‌త శుక్ర‌వారం మూడు సినిమాలు రిలీజైతే అందులో `అభిమ‌న్యుడు` మిన‌హా మిగ‌తా సినిమాలు రేసులో వెన‌క‌బ‌డిపోయాయన్న రిపోర్ట్ అందింది. డిజిట‌ల్ ఇండియా లోపాల‌పై తెర‌కెక్కించిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌లో విశాల్- అర్జున్ కాంబినేష‌న్‌ మైండ్ బ్లోయింగ్ పెర్ఫామెన్స్‌తో క‌ట్టిప‌డేశారు. అనువాద చిత్ర‌మే అయినా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 3రోజుల్లో 6కోట్లు వ‌సూలు చేసి సంచ‌ల‌నం సృష్టించింది. 

విశాల్ కెరీర్ బెస్ట్ వ‌సూళ్ల‌తో `అభిమ‌న్యుడు` ట్రేడ్‌లో ఉత్సాహం నింపింది. విశాల్ సినిమా తొలి వీకెండ్ వ‌సూళ్ల ధ‌మాకా వివ‌రాలు ఇలా ఉన్నాయి. నైజాం -2.9కోట్లు, సీడెడ్‌-69ల‌క్ష‌లు, వైజాగ్‌-76ల‌క్ష‌లు, గుంటూరు-54ల‌క్ష‌లు, కృష్ణ‌-57ల‌క్ష‌లు, నెల్లూరు-28ల‌క్ష‌లు, తూ.గో జిల్లా-40ల‌క్ష‌లు, ప‌.గో జిల్లా-26ల‌క్ష‌లు వ‌సూలైంది. ఓవ‌రాల్‌గా 6.4కోట్ల వ‌సూళ్లు కేవ‌లం మూడురోజుల్లో సాధించింది ఈ చిత్రం. పి.ఎస్‌.మిత్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మాత‌-పంపిణీదారుడు హ‌రి రిలీజ్ చేశారు.