మహర్షి బాటలో విశాల్ సినిమా కూడా..!!

మహర్షి బాటలో విశాల్ సినిమా కూడా..!!

మహేష్ బాబు మహర్షి సినిమా మొదట ఏప్రిల్ 5 న రిలీజ్ కావాల్సి ఉన్నా ఏప్రిల్ 25 వ తేదీకి పోస్ట్ ఫోన్ చేశారు.  ఆ తరువాత కొన్ని టెక్నికల్ సమస్యల కారణంగా సినిమాను మే 9 వ తేదీకి వాయిదా వేసినట్టు యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

ఇప్పుడు ఇదే బాటలో తమిళ హీరో విశాల్ కూడా నడుస్తున్నాడు.  విశాల్ చేస్తున్న టెంపర్ రీమేక్ అయోగ్య సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేశారు.  ఏప్రిల్ 19 వ తేదీన సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వలన ఏప్రిల్ 19 నుంచి సినిమాను మే 10 వ తేదీకి వాయిదా వేశారు.  విశాల్ కు తెలుగులో మంచి మార్కెట్ ఉంది కాబట్టి ఈ అయోగ్య సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారేమో చూడాలి.