ఆటిట్యూడ్ తో సహా...దించేశాడు..!!

 ఆటిట్యూడ్ తో సహా...దించేశాడు..!!

విశాల్ హీరోగా వస్తున్న అయోగ్య సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది.  మురుగదాస్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశాడు.  పూర్తిస్థాయి యాక్షన్ తో ఈ సినిమా తెరకెక్కింది.  విశాల్ అద్భుతమైన నటుడని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నాడు.  వాడు వీడు అనే సినిమాలో విశాల్ కనబరిచిన నటన చూస్తేనే అర్ధం అవుతుంది విశాల్ లో ఉన్న నటుడు ఎలాంటి వాడో.  ఎంత వాడుకుంటే అంత షార్ప్ అవుతాడు.  అందులో సందేహం లేదు.  విశాల్ లోని మాస్ ఆటిట్యూడ్ కు మరింత పదునుపెట్టే సినిమాగా అయోగ్య మారుతుంది అనడంలో సందేహం లేదనిపిస్తుంది.  

టెంపర్ సినిమాలో ఎన్టీఆర్ ఎలాగైతే హైఆటిట్యూడ్ తో కనిపించి కనువిందు చేశాడో.. కోలీవుడ్ లో అయోగ్యలోను విశాల్ ఆటిట్యూడ్ తో నటనను కనబరుస్తున్నాడు అనడంలో సందేహం లేదు.  ఈ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.  మరి రిలీజ్ తరువాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తోందో చూడాలి.