రైతులకు వాటా ఇస్తున్న స్టార్ హీరో !

రైతులకు వాటా ఇస్తున్న స్టార్ హీరో !

 

సామాజిక కార్యక్రమాలు చేయడంలో తమిళ స్టార్ హీరో విశాల్ ఎప్పుడూ ముందుంటారు.  ఇప్పటికే పలు సందర్బాల్లో సహాయ కార్యక్రమాలు చేపట్టి సేవా దృక్పథాన్ని చాటుకున్న విశాల్ తాజాగా ఇంకో అడుగు ముందుకు వేశారు.  తన తాజా చిత్రం 'అయోగ్య' కు అమ్ముడయ్యే ప్రతి టికెట్ డబ్బులోనూ తమిళనాడు రైతులకు ఒక రూపాయి వాటా ఇవ్వనున్నాడు విశాల్.  గతంలో కూడా 'అభిమన్యుడు' సినిమా విడుదల సమయంలో కూడా ఇదే పని చేశాడు విశాల్.  విశాల్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ఆయన అభిమానులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.