రిస్క్ చేస్తున్న విశాల్ 

రిస్క్ చేస్తున్న విశాల్ 

తమిళ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం ఇరుంబు తిరు..తెలుగులో అభిమన్యుడు పేరుతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆల్రెడీ షూటింగ్ పార్ట్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంది. పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందింది. విశాల్ ఇందులో ఆర్మీ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుండగా, యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటించాడు. 

ఇప్పుడు విశాల్ చేస్తున్న రిస్క్ ఏంటంటే..సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉండగా..తమిళ సినీ పరిశ్రమలో నెలకొన్న బంద్ దృష్ట్యా వాయిదా పడుతూ వస్తోంది. సో ఇక హైప్ ని క్రియేట్ చేయాలనే నెపంతో విడుదలకు ముందే మీడియా మిత్రులకు ఇంటర్వెల్ వరకు సినిమాను చూపించాలని విశాల్ నిర్ణయించాడట. దీని వల్ల సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. ఈ సినిమాలో విశాల్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల కోణంలో ఉండనుంది. ఈ ఎంటర్టైనర్ మే 11న విడుదల కానుంది.