ఈనెల చివర్లో రానున్న విశాల్ 

ఈనెల చివర్లో రానున్న విశాల్ 

తమిళ స్టార్ హీరో విశాల్ కు తెలుగు నాట మంచి మార్కెట్ ఉంది. ఆయన నటించిన సినిమాలకు రెగ్యులర్ హీరోలకు వచ్చే ఓపెనింగ్స్ వస్తుంటాయి. కెరియర్ ఆరంభం నుండి ప్రతి సినిమాను తెలుగులో డబ్ చేయడం మూలాన ప్రేక్షకులకు బాగానే చేరువయ్యారు. ఈ హీరో తాజాగా నటించిన "ఇరుంబు తిరై" గతవారమే విడుదలై తమిళ నాట మంచి విజయాన్ని సాధించింది. విశాల్ సరసన సమంత హీరోయిన్ గా నటించింది. 

ఈ చిత్రాన్ని తెలుగులో "అభిమన్యుడు" పేరుతో జి.హరి రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుతున్న సమాచారం మే చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాడు. ఈ సినిమా సెన్సార్ ముందుకు వెళ్లగా యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది. సైబర్ వార్, డేటా దొంగతనం వంటి అంశాలతో నేటి తరంలో చవిచూస్తున్న సమస్యలపై ఈ చిత్రం ఉండనుంది. యాక్షన్ కింగ్ అర్జున్ విలన్ పాత్రలో నటించారు. ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కు పి ఎస్ మిత్రన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చారు.