బాబు పిలుపు హాస్యాస్పదం...

బాబు పిలుపు హాస్యాస్పదం...

ఎన్డీఏ నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత టీడీపీ, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి... రోజుకో అంశంపై టీడీపీ, సీఎం చంద్రబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... మరోసారి ఏపీ సీఎంపై ఫైర్ అయ్యారు. చంద్రబాబు కుటుంబపాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. కర్నాటకలో భారతీయ జనతా పార్టీని ఓడించాలంటూ చంద్రబాబు పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారాయన. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు సహజంగానే వచ్చిన నైపుణ్యతన్న విష్ణుకుమార్ రాజు... గతంలో స్వర్గీయ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచన చంద్రబాబు... బీజేపీకి వెన్నుపోటు పొడవాలని... ప్రజల్లో బీజేపీపై తప్పుడు సంకేతాలు పంపేలా ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని జోస్యం చెప్పారు విష్ణుకుమార్ రాజు.