వైసీపీ ప్రభుత్వం బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే ! 

వైసీపీ ప్రభుత్వం బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లే ! 

వైసీపీ ప్రభుత్వం బీజేపీతో పెట్టుకుంటే నిప్పుతో చెలగాటం ఆడినట్లేనని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి అన్నారు. గుడివాడలో విలేఖర్ల సమావేశం నిర్వహించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. చలో అమలాపురం కార్యక్రమానికి వెళ్ళిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్ రెడ్డి  తనను అరెస్ట్ చేసి, ఇరవై గంటలు పలు ప్రాంతాలలో తిప్పి గుడివాడ తీసుకొచ్చారని పోలీసులు మీద ఫైర్ అయ్యారు. అంతర్వేది ఘటనలో నిర్లక్ష్యం వహించిన ఏలూరు రేంజ్ డీఐజీ,తూర్పు గోదావరి జిల్లా ఎస్పి, అమలాపురం డిఎస్పీ లను ప్రభుత్వం సస్పెండ్ చేయాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి,జగన్ ప్రభుత్వం పోలీస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుందన్న ఆయన అడగకుండానే అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు అన్నింటిపై సీబీఐ విచారణ జరపాలని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. నన్ను అరెస్ట్ చేసి నా వ్యక్తి గత స్వేచ్ఛను హరించిన పోలీసులపై,భారత ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.