'ఏపీలో మాకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు'

'ఏపీలో మాకు ఒక్క ఎంపీ సీటు కూడా రాదు'

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి ఎంపీ సీటు ఒక్కటి కూడా రాదని ఆ పార్టీ నేత విష్ణుకుమార్‌రాజు చెప్ఆరు. 3 ఎమ్మెల్యే సీట్లు గెలిచే అవకాశం ఉందన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని తేలడంతో బాధపడేవారు ఎక్కువయ్యారని అన్నారు. బెంగాల్‌లో కూడా బీజేపీకి 30 సీట్లు వస్తాయని.. తమ దగ్గర పక్కా సమాచారం ఉందని విష్ణు చెప్పారు. కొంతమంది నేతలు ఢిల్లీ వచ్చి అందరినీ కూడగట్టే ప్రయత్నం చేయడం రెండు రోజుల ముచ్చటగా మిగిలిపోయిందన్నారు.