విష్ణుకుమార్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

విష్ణుకుమార్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వైసీపీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేశాయని.. బీజేపీ, జనసేన మాత్రం నిబంధనలు అతిక్రమించి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని బీజేపీ నేత విష్ణుకుమార్‌రాజు అన్నారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీడీపీ, వైసీపీలు వ్యవహరించాయని ఆరోపించారు. డబ్బులతో ఓటర్లను ఆ రెండు పార్టీల నేతలూ ప్రభావితం చేశారని అన్నారు. తాను పోటీ చేసిన విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ఓడిపోబోతున్నారని విష్ణు చెప్పారు.