హిట్2 హీరో అతడే..?

హిట్2 హీరో అతడే..?

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. మాస్‌ కా దాస్ కెరీర్‌లో హిట్ మర్చిపోలేని విజయాన్ని అందించిన సినిమా. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో విశ్వక్‌కు ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో రుహాని శర్మ హీరోయిన్‌గా నటించారు. అంతేకాకుండా భానుచందర్, బ్రహ్మాజి, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో అలరించారు. ఈ సినిమా తరువాత పరిశ్రమలో విశ్వక్ మార్కెట్ రేంజ్ వేరే స్థాయికి వెళ్లింది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా సీక్వెల్ హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా రెండవ భాగం ఉంటుందా ఉండదా, ఉంటే అందులో హీరోగా ఎవరు చేస్తారన్న సందేహాలు ప్రేక్షకుల్లో వచ్చాయి. అయితే ఈరోజుతో హిట్ సినిమా వచ్చి ఏడాది అయిన సందర్భంగా ఈ సినిమా సీక్వెల్‌పై క్లారిటీ వచ్చింది. హిట్2లో హీరో విశ్వక్ కాదంట. కానీ హిట్2 సినిమా మాత్రం వస్తుందని తెలిపారు. ప్రస్తుతం హిట్2లో హీరో విషయంపై ప్రేక్షకులు అనేక ఊహాగానాలు చేస్తున్నారు. ఇందులో మరో యంగ్ హీరో అడవి శేష్ చేస్తున్నారని, అంతేకాకుండా హిట్ సినిమా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కగా హిట్2 ఆంధ్రా పోలీసుల నేపథ్యంలో రానుందని టాక్  నడుస్తోంది. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమనేది తెలియాలంటే కాస్త సమయం వేచి చూడాల్సిందే.