ఆగష్టు 10నే విశ్వరూపం 2 రిలీజ్

ఆగష్టు 10నే విశ్వరూపం 2 రిలీజ్

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న విశ్వరూపం 2 సినిమా ఆగష్టు 10 న విడుదల కావాల్సి ఉన్నది.  అయితే, కరుణానిధి మరణంతో.. ఈ సినిమా వాయిదా పడినట్టుగా ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.  కానీ, ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలుస్తున్నది.  ముందుగా అనుకున్న ప్రకారమే ఆగష్టు 10 న విశ్వరూపం 2 ను విడుదల చేయబోతున్నారట.  

గతంలో కమల్ హాసన్ విశ్వరూపం సినిమా మంచి విజయం సాధించింది.  కమర్షియల్ గా మంచి విజయం సాధించడంతో దానికి సీక్వెల్ నిర్మిస్తానని గతంలోనే కమల్ పేర్కొన్నాడు.  ఎన్నో వ్యయప్రయాసలు పడి విశ్వరూపం 2 ను తెరకెక్కించాడు కమల్.  విడుదలైన ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  తమిళ, తెలుగు, హిందీ భాషల్లో రూపొయిందిన ఈ సినిమా ఆగష్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.  ఇదే కమల్ హాసన్ నటించే చివరి సినిమా అని ఇప్పటికే ప్రకటించాడు. విశ్వరూపం 2 తరువాత కమల్ పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాబోతున్నారు.