ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం

ఏపీ గవర్నర్‌గా బిశ్వభూషణ్‌ ప్రమాణస్వీకారం

ఏపీ నూతన గవర్నర్‌గా బిశ్వభూషణ్ హరిచందన్‌ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సి.ప్రవీణ్‌ కుమార్‌ ప్రమాణం చేయించారు. రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా నరసింహన్‌ వ్యవహరించారు.  
ఒడిశాకు చెందిన బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఒడిశా బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. న్యాయ విద్యలో పట్టభద్రుడైన ఆయన.. తొమ్మిదేళ్లు ఒడిశా రాష్ట్ర మంత్రిగా సేవలందించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యలరు.  శేష ఝలక్‌, అస్తాశిఖా, రాణాప్రతాప్‌, మానసి, మారు బతాస్‌ తదితర పుస్తకాలను కూడా హరిచందన్‌ రచించారు.