లాక్ డౌన్ : మూడు నెలల తర్వాత భారత్ కు విశ్వనాథన్‌ ఆనంద్‌ 

లాక్ డౌన్ : మూడు నెలల తర్వాత భారత్ కు విశ్వనాథన్‌ ఆనంద్‌ 

భారత చెస్ దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మూడు నెలల తర్వాత భారత్ కు తిరిగి వస్తున్నాడు. ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో పాల్గొనేందుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఐరోపా వెళ్లిన ఆయన.. కరోనా కారణంగా చాల దేశాలు లాక్‌డౌన్ విధించడంతో జర్ననీలోని బాడ్‌సోడెన్ లో ఈ మూడు నెలలు తన సమయాన్ని గడిపాడు. ప్రస్తుతం అని దేశాలు లాక్ డౌన్ లో ఇస్తున్న సడలింపుల కారణంగా  భారత్‌ కు బయలుదేరిన ఆనంద్‌  ఈరోజు బెంగళూరుకు చేరుకోనున్నాడు. భారత్ కు వచ్చిన తర్వాత మన నిబంధనల ప్రకారం 14 రోజులు నిర్బంధం లో ఉండి తర్వాత తన ఇంటికి వెళ్తాడు.  అయితే కరోనా కారణంగా వేరే దేశంలో ఉన్న "వేస్ట్ పిక్చర్స్ కమ్యూనిటీ"కి ఆనంద్ తదితరులు ఆన్లైన్ చెస్ ఛారిటీ కార్యక్రమంలో పాల్గొని పీఎం-కేర్స్ ఫండ్ కోసం విరాళాలు సేకరించారు.