అజిత్ దర్శకుడితో.. బన్నీ సినిమా..?

అజిత్ దర్శకుడితో.. బన్నీ సినిమా..?

నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా పరాజయం తరువాత అల్లు అర్జున్ ఆచీతూచీ అడుగు వేయాలని నిర్ణయించుకున్నారు.  అనేక కథలు విన్న అల్లు అర్జున్.. మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.  గీతా ఆర్ట్స్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.  ఇదిలా ఉంటె.. అల్లు అర్జున్ మరో దర్శకుడితో సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

అజిత్ తో వీరం, వేదాళం, వివేగం వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసి, ఇప్పుడు అజిత్ తోనే విశ్వాసం అనే సినిమా చేస్తున్న దర్శకుడు శివ తో అల్లు అర్జున్ సినిమా చేయబోతున్నాడట.  స్టూడియో గ్రీన్ అనే సంస్థ ఈ సినిమాను నిర్మిస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.  తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తున్నది.  అజిత్ విశ్వాసం సినిమా 2019 కి పూర్తవుతుంది.  ఈ సినిమా పూర్తయ్యాక శివ దర్శకత్వంలో బన్నీ సినిమా చేస్తారని వార్తలు వస్తున్నాయి.  ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నదో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.