వీడియో: 'విశ్వాసం' ట్రైలర్‌ విడుదల

వీడియో: 'విశ్వాసం' ట్రైలర్‌ విడుదల

తమిళ స్టార్ హీరో 'అజిత్‌' నంటించిన 'విశ్వాసం' సినిమా తమిళంలో సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అజిత్ సరసన  నయనతార హీరోయిన్ గా నటించింది. జగపతిబాబు కీలక పాత్ర పోషించాడు. డి.ఇమాన్‌ సంగీతం అందించారు. సత్యజ్యోతి ఫిల్మ్స్‌ పతాకంపై సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌లు నిర్మించారు. అజిత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా మన దగ్గర కూడా ఈ సినిమాను అదే పేరుతో త్వరలోనే విడుదల చేస్తున్నారు. శనివారం చిత్ర బృందం విశ్వాసం తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది.

'జీవితంలో ఒకసారి ఏడవని ధనవంతుడూ లేడు. ఒకసారి నవ్వని పేదవాడూ లేడు' అనే డైలాగ్ తో ట్రైలర్‌ ప్రారంభమైంది. 'బామ్మర్థి దుమ్మురేపుదామా', 'మీది గొప్ప అందం', 'నా కథలో నేను హీరోనురా', 'నా కథలో నే విలన్ రా' అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక ట్రైలర్‌ చివర్లో అజిత్‌ చెప్పే డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజిత్‌ రెండు పాత్రల్లో అదరగొట్టాడు. ఇక ఆలస్యం ఎందుకు మీరు ఓ లుక్కేయండి.