విశ్వాసం కూడా ఇంచుమించుగా అలాంటిదే.. !!

విశ్వాసం కూడా ఇంచుమించుగా అలాంటిదే.. !!

అజిత్ విశ్వాసం సినిమా ఈరోజు భారీ ఎత్తున రిలీజ్ అయింది.  పక్కా మాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.  శివ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న నాలుగో సినిమా ఇది.  వరసగా సినిమాలు చేస్తున్నాడు.  వీరం, వేదాళం, వివేగం ఇప్పుడు ఇప్పుడు విశ్వాసం.  

సినిమా మొదటి అక్షరం వి తో మొదలవుతుండటం విశేషం.  అక్షరాలా మాదిరిగానే ఈ సినిమాల్లోని మెయిన్ కథ ఒకేలా ఉంటున్నది.  వీరం సినిమాలో తనకు కావలసిన వ్యక్తులను కాపాడుకోవడం అనే అంశం చుట్టూ సినిమా నడుస్తుంది.  వేదాళంలో సోదరిని కాపాడుకోవడానికి జరిగే పోరాటం కాగా, వివేగంలో గర్భవతిగా ఉన్న భార్యను రక్షించుకోవడం కోసమే జరిగే యుద్ధం.  నాలుగో సినిమా విశ్వాసంలో తన కూతురును కాపాడుకునే అంశం చుట్టూ కథ నడుస్తుంది.  నాలుగు సినిమాల్లోనూ మెయిన్ పాయింట్ ఇంచుమించుగా ఒకేలా ఉన్నప్పటికీ.. శివ సినిమాను మాస్ యాంగిల్ లో టేకింగ్ చేయడం వలన సినిమాలు హిట్ అవుతూ వస్తున్నాయి.  ఈసారైనా శివ తన మెయిన్ పాయింట్ ను మారుస్తారో లేదంటే రొటీన్ గా ఇలాంటి కథనే ఎంచుకొని సినిమా చేస్తారో చూడాలి.