మార్చి 1 న అజిత్ విశ్వాసం..

మార్చి 1 న అజిత్ విశ్వాసం..

అజిత్ తమిళ్ బ్లాక్ బస్టర్ సినిమా విశ్వాసం తెలుగులో రిలీజ్ కాబోతున్నది.  దీనికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి.  తమిళంలో సూపర్ హిట్ కావడంతో డిమాండ్ బాగా పెరిగింది.  కన్నడంలో జగమళ్ళ పేరుతో డబ్బింగ్ చేసుకుంటోంది.  కన్నడంలో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యే విషయాన్ని మరో కొన్ని రోజుల్లో అఫీషియల్ గా ప్రకటించనున్నారు.  

తెలుగులో ఈ సినిమాను మార్చి 1 వ తేదీన రిలీజ్ చేసేందుకు యూనిట్ ప్లాన్ చేస్తున్నది.  తమిళంలో ఈ సినిమా దాదాపు రూ.120 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది.  దీంతో ఇతరభాషల్లో ఈ సినిమాకు డిమాండ్ భారీగా పెరగడం విశేషం.