మూడ్ తో చెలగాటమాడే విటమిన్ల గురించి తెలుసా?

మూడ్ తో చెలగాటమాడే విటమిన్ల గురించి తెలుసా?

స్నేహ సంబంధాలు, వర్క్ రిలేషన్స్ సజావుగా ఉండాలంటే మన మూడ్ ఎల్లవేళలా బాగుండాలి. దాని మీదే సోషల్ రిలేషన్స్, వర్క్ రిలేషన్స్ ఆధారపడి కొనసాగుతాయి. డిప్రెషన్, యాంగ్జయిటీ, స్ట్రెస్ వంటి బ్యాడ్ మూడ్స్ దూరం కావాలంటే అందుకు ఉపయోగపడే విటమిన్స్ ను విరివిగా తీసుకోవాలి. అవేంటో చూడండి.

 

 

 

 

 

 

 

 

 

విటమిన్ డి:-
మానవ మేధ మీద ప్రభావం చూపడంలో డి విటమిన్ చాలా కీలకం. ఆరోగ్యం మీద ఎంతో శ్రద్ధ కనబరుస్తూ చాలా ఖరీదైన ఇన్ టేక్స్ తీసుకుంటున్న ఈ రోజుల్లో కూడా విటమిన్ 'డి' ని ప్రపంచమంతా విస్మరిస్తోంది. సూర్యుని నుంచి ఉచితంగా లభించే సూర్యకాంతిని వినియోగించుకోలేకపోతున్న కారణంగా అత్యధిక శాతం మంది డిప్రెషన్ బారిన పడుతున్నారు. స్ట్రెస్ కు గురవుతున్నారు. ఇటీవల జరిగిన ఓ అధ్యయనం ప్రకారం అమెరికాలోని 75 శాతం మంది ప్రజలు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. అందులో పెద్దలతో పాటు టీనేజర్స్ కూడా ఉన్నారు. బాడీ మీద పడే సూర్యకాంతిని మెదడు గ్రహించి దాని పనితీరును మెరుగు పరుచుకొంటుంది. మెదడు పనితీరు అంటే.. జ్ఞాపకశక్తి, మేధాశక్తి, చురుకుదనం వంటి లక్షణాలు అన్నమాట. ఇది ఎముకలు, దంతాల పటిష్టతకూ మేలు చేస్తుంది. డి విటమిన్ కోసం ప్రతిరోజూ ఓ 20 నిమిషాల పాటు సూర్యకాంతి తగిలేలా చూసుకుంటే చాలు.

 

 

 

 

 

 

 

ఒమేగా 3ఎస్:-
బ్రెయిన్ హెల్త్ ను ప్రభావితం చేయడంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ప్రముఖంగా పని చేస్తాయని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి అందులోంచి ఒమేగా 3ఎస్ సంప్లిమెంట్స్ అందించినట్టయితే మన మెదడు చురుగ్గా పని చేస్తుంది. చేపల్లో ఒమేగా 3ఎస్ విరివిగా దొరకుతుంది. చేపలు తిననివారు చేప నూనె కూడా వాడొచ్చు. చేపలతో పాటు బాదం, పిస్తా, వాల్నట్స్, చియా సీడ్స్, దోస గింజల పలుకుల్లో ఒమేగా 3 ఎస్ సప్లిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

 

 

 

 

 

 

 

 

విటమిన్ బి6:-
శారీరక, మానసిక పనితీరు మీద ప్రభావం చూపడంలో విటమిన్ బి6 చాలా కీలకంగా వ్యవహరిస్తుంది. దీన్నే వైద్య పరిభాషలో పిరిడాక్సిన్ అంటారు. న్యూరోసైకియాట్రిక్ డిజార్డర్స్ మీద ఇది అద్భుతంగా పని చేస్తుంది. మహిళల్లో రుతుక్రమాన్ని బ్యాలెన్స్ చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేవారిలో బి విటమిన్ తీవ్రంగా లోపిస్తుంది. ముఖ్యంగా బి 6 లెవల్స్ బాగా పడిపోతాయి. కాబట్టి ఆ సమయంలో బి 6 సప్లిమెంట్స్ బాగా అవసరం అవుతాయి. ట్యాబ్లెట్ల రూపంలో దీన్ని డెయిలీ 25 ఎంజీ చొప్పున తీసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

విటమిన్ బి3:-
దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. ఇది సెరిటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. సెరిటోనిన్ రక్తకణాలు, సీరం లో నిక్షిప్తమై ఉంటుంది. దీనివల్లే బ్రెయిన్ సెల్స్ పంపే సంకేతాలు శరీరంలోని నర్వస్ సిస్టమ్ కు చేరుతాయి. ఇది లోపిస్తే డిప్రెషన్ కు దారితీస్తుంది. మెదడు చురుకుదనం తగ్గి మూడ్ చెడిపోతుంది. అయితే డిప్రెషన్ తీవ్రతను బట్టి విటమిన్ బి3 ని ప్రతిరోజూ కనీసం 20 ఎంజీ తీసుకోవాలంటున్నారు వైద్యులు.

 

 

 

 

 

 

 

 

విటమిన్ బి12:-
మూడ్ ని మెరుగుపరచడంలో, చురుకుదనాన్ని పెంపొందించడంలో విటమిన్ బి12 ఎంతో ఉపయోగపడుతుంది. దీన్ని సమృద్ధిగా తీసుకున్నవారికి డిప్రెషన్ దరి చేరదు. బి-12 లోపం కారణంగా డిప్రెషన్ తో బాధపడుతున్నవారి సంఖ్య అమెరికాలో 15 శాతం ఉందట. దీనికి పరిష్కారంగా రోజూ 10 ఎంజీ చొప్పున బి-కాంప్లెక్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. శాకాహారుల్లో దీని లోపం తరచుగా తలెత్తుతుందని తేల్చారు. విటమిన్ లోపాన్ని భర్తీ చేయాలంటే బీఫ్ లివర్, చేప పిల్లలు, గొర్రె మాంసం, గుడ్లు, వెన్నలో లభిస్తుంది.
 

 

 

 

 

 

 

 

 

ఫోలేట్:-
దీన్నే ఫోలిక్ యాసిడ్ లేదా విటమిన్ బి9 గా పిలుస్తారు. శరీరంలో కొత్త క్త కణాలు ఉత్పత్తి కావడానికి ఇది తోడ్పడుతుంది. ప్రెగ్నెంట్ లేడీస్ ఆరోగ్యవంతమైన బేబీకి జన్మనివ్వాలన్నా, వారి కాన్పు సజావుగా జరగాలన్నా విటమిన్ బి9 సమృద్ధిగా ఉండడం తప్పనిసరి. ఇది తగ్గిపోతే నరాల్లో సంభవించే అనెన్సిఫలీ, స్పైనా బిఫైడా అనే లోపాలతో పిల్లలు పుడతారు. ఫోలిక్ యాసిడ్ న్యూరో ట్రాన్స్ మిటర్ గా పనిచేసే సెరిటోనిన్ ఉత్పత్తిని సమతుల్యం చేసి మూడ్ ని నియంత్రణలో ఉంచుతుంది. డాక్టర్ల సూచన మేరకు రోజూ 400 ఎంసీజీ ఫోలిక్ యాసిడ్ ను తీసుకోవాల్సి ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

 

మెగ్నీషియం:-
మెదడు రిలాక్స్ కావడానికి మెగ్నీషియం ఎంతో అవసరం. అలాగే కండరాలు  బిగుసుకుపోవడం, అజీర్తి వంటి అనేక అవలక్షణాల మీద ఇది బాగా పనిచేస్తుంది. దాదాపు సగం మంది అమెరికన్లు మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. ఇది ముడి ధాన్యం, డ్రైడ్ బీన్స్, నట్స్, ముదురాకు పచ్చని గింజ ధాన్యాల్లో ఇది పుష్కలంగా దొరుకుతుంది. తక్షణ ఫలితానికి 320 నుంచి 450 ఎంజీ చొప్పున మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

 

 

 

 

 

 

 

 

 

విటమిన్ సి:-
మనిషి మూడ్ తో విటమిన్ సి కి ఉన్న సంబంధం మీద రుజువులు లభించాయి. ముఖ్యంగా పెద్దవాళ్లలో మెదడు పనితీరు మీద విటమిన్ సి బలంగా పనిచేస్తుంది. ఇది లోపిస్తే డిప్రెషన్ కు, యాంగ్జయిటీకి దారితీస్తుంది. ఇది నీటిలో కరిగే విటమిన్ కాబట్టి బాడీలో నిల్వ ఉండదు. కాబట్టి ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవాల్సిందే. 100 ఎంజీ నుంచి 2000 ఎంజీ వరకు తీసుకోవచ్చు. మోతాదు మించితే డయేరియాకు దారితీసే ప్రమాదముంది. ఇది ముఖ్యంగా నిమ్మ జాతి పళ్లలో పుష్కలంగా ఉంటుంది.

 

 

 

 

 

 

 

 

 

ఐరన్
పేరుకు తగినట్టు ఇది గనక లోపిస్తే మనిషి నిర్వీర్యంగా కనిపిస్తాడు. శక్తినంతా ఎవరో లాగేసినట్టు, విపరీతమైన అలసటగా తయారవుతాడు. ఏ పని చేయాలన్నా మూడ్ రాదు. 10 శాతం మంది మహిళలు, 2 శాతం మంది పురుషులు ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. రుతుక్రమం వల్ల మహిళలకు ఐరన్ రీప్లేస్ మెంట్ మీద శ్రద్ధ తీసుకోవాలి. శరీరంలో సరిపడినంత ఐరన్ ఉంటే మలబద్ధకం సమస్య ఉండదు. ఇది లివర్, పాలకూర, పాలు, డ్రైఫ్రూట్స్, తృణధాన్యాలు, సోయా బీన్స్ లో పుష్కలంగా లభిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

క్రోమియం:-
మనిషికి ఇది తక్కువ మోతాదులోనే అవసరం అయినప్పటికీ దీని లోపం కారణంగా బాధపడేవారి సంఖ్య కూడా గణనీయంగానే ఉంది. 25 నుంచి 50 శాతం మంది అమెరికా పౌరులు ఈ లోపాన్ని ఎదుర్కొంటున్నారట. రక్తంలోని షుగర్ లెవల్స్ ను సమతుల్యంగా ఉంచడం ద్వారా మూడ్ ని ప్రభావితం చేస్తుంది. సెరిటోనిన్, మెలటోనిన్ వంటి బ్రెయిన్ కెమికల్స్ ఉత్పత్తికి ఇది దోహదపడుతుంది. మాంసం, బంగాళాదుంపల్లో క్రోమియం విరివిగా లభిస్తుంది.

 

 

 

 

 

 

 

 

 

ఎల్-థియానిన్:-
సెరిటోనిన్ ఉత్పత్తి పెరగడానికి, మెదడులో ఆల్ఫా వేవ్స్ పెరుగుదలకు కారణమైన అమైనో యాసిడ్స్ గ్రీన్ టీలో పుష్కలంగా ఉన్నాయని అనేక పరిశోధనల్లో తేల్చారు. నరాలను యాక్టివ్ చేసే ఆర్గానిక్ కాంపౌండ్స్ నే ఎల్-థియానిన్ గా పేర్కొంటున్నారు. అది గ్రీన్ టీలోనే ఉంది. కాబట్టి రోజూ గ్రీన్ టీ తీసుకుంటే బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ వృద్ధి చెంది మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందన్నమాట.